వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన జెడ్పీటీసీలు, ఎమ్పీటీసిలు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునేందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ప్రజలంతా అండగా నిలిచారని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు సీఎం కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఈ సంధర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని మంత్రి దయాకర్‌రావు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.