ఎన్డీయే కూటమిలో పీఎంకే!

5
- Advertisement -

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. డీఎంకేకు గట్టి సవాల్ విసరేందుకు పటాలి మక్కల్ కచ్చి (పీఎంకే) ఏఐఏడీఎంకే, బీజేపీలతో కలిసి ఎన్డీఏ కూటమిలో చేరింది. ఈ విషయాన్ని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ ప్రకటించారు.

చెన్నైలో నిర్వహించిన సంయుక్త ప్రెస్‌మీట్‌లో ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి కె. పలనిస్వామితో కలిసి మాట్లాడిన అన్బుమణి రామదాస్, తమ పార్టీ అధికారికంగా ఎన్డీఏ కూటమిలో భాగమైందని తెలిపారు. ఈ సందర్భంగా పలనిస్వామి మాట్లాడుతూ, ఇప్పటికే బీజేపీతో తమకు కూటమి ఉందని, మరిన్ని పార్టీలను కూడా ఎన్డీఏలోకి ఆహ్వానించే అవకాశం ఉందని అన్నారు.

పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ కూడా ఎన్డీఏ కూటమిలో చేరారు. ఇంకా ఇతర పార్టీలూ చేరే అవకాశముంది. మా కూటమి విజయం సాధించే కూటమి అని పలనిస్వామి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ అన్బుమణి రామదాస్ కూడా ఎన్డీఏతో కలిసి ఏఐఏడీఎంకేతో పీఎంకే చేతులు కలిపింది అని స్పష్టం చేశారు.

ఈరోజు ఉదయం చెన్నైలోని పలనిస్వామి నివాసంలో అన్బుమణి రామదాస్ ఆయనతో భేటీ అయ్యారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ వేడి పెరిగింది. 2021లో అధికారాన్ని కోల్పోయిన ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది, అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆ కూటమి ఆశించిన ఫలితాలు రాలేదు.

2026 ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు పళనిస్వామి. అలాగే డీఎంకే పాలనలో లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

Also Read:భార్య వంట చేయకపోవడం క్రూరత్వం కాదు!

- Advertisement -