ప్రధానమంత్రిగా దక్షిణాది నేత..కేసీఆర్ ప్లాన్ ఇదే..!

391
kcr stalin
- Advertisement -

కాంగ్రెస్,బీజేపీలకు ప్రత్యామ్నాయంగా సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు తెలంగాణ సీఎం. ఇప్పటికే పలుదఫాలకు వివిధ పార్టీల అధినేతలతో సమావేశమైన కేసీఆర్ రాష్ట్రాల హక్కులే ప్రధాన ఎజెండగా ముందుకు సాగుతున్నారు.

తన ప్రయత్నంలో భాగంగా దక్షిణాది నేతను ప్రధాని పీఠంపై కూర్చుండబెట్టే ప్రయత్నాలను చేస్తున్నారు. 1996లో నాడు 14 పార్టీల మద్దతుతో జేడీఎస్ నేత దేవే గౌడ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టి దక్షిణాది నేతను ప్రధాని చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాది నేతను ప్రధానమంత్రి చేయడం ద్వారా ఆయా రాష్ట్రాలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఇందుకోసం సమగ్ర ప్రతిపాదనను ఆయా పార్టీల నేతల ముందు ఉంచి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా కేరళ,తమిళనాడు,కర్నాటక టూర్లకు శ్రీకారం చుట్టిన కేసీఆర్…కేరళ సీఎంతో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. సేమ్ టైమ్ తమిళనాడు,కర్నాటక పర్యటనలో భాగంగా స్టాలిన్‌,కుమారస్వామిల ముందు కూడా తన ప్రతిపాదన ఉంచనున్నారు గులాబీ బాస్. మొత్తంగా మే 23 తర్వాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -