అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం..

19
modi

దేశ వ్యాప్తంగా మళ్ళీ విజృంభిస్తున్న నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు.. ఈ సమావేశం ఈరోజు సాయంత్రం 6:30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించ‌నున్నారు. సంద‌ర్భంగా క‌రోనా వ్యాప్తి, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై చ‌ర్చించ‌నున్నారు.

క‌రోనా మ‌హ‌మ్మారి నివార‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను సీఎంల‌కు మోదీ సూచించ‌నున్నారు. మ‌హారాష్ట్రాలో కేసుల తీవ్ర‌త‌పై ప్ర‌త్యేకంగా చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ప‌లు న‌గ‌రాల్లో రాత్రి క‌ర్ఫ్యూ అమ‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించాల‌నే నిబంధ‌న‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని రాష్ట్రాల‌కు ప్రధాని సూచించనున్నారు.