‘దేవ్’.. వారికి సరిగ్గా సరిపోతుంది

305
- Advertisement -

తమిళ హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవ్’.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో కార్తీ, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్ హాజరైయ్యారు.

Hero Karthi

ఈ వేడుకలో హీరో కార్తీ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.. ప్రజెంట్ జనరేషన్ మూవ్ అవుతున్న జోనర్‌లో ఓ సినిమా చేయాలనుకున్నాను.. దేవ్ సినిమా ఇప్పటి జనరేషన్‌లో ఉన్న వారికి సరిగ్గా సూట్ అవుతుంది.. చాల అందమైన కథ దేవ్ సినిమా.. ఈ సినిమాకి అందరు కనెక్ట్ అవుతారు.. లవ్ అండ్ ఫ్రెండ్షిప్ చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమాలోని మేఘన పాత్రకు రకుల్ పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యింది.. రెండు వేరు వేరు ఆలోచనలున్న వ్యక్తుల లవ్ ఎలాంటి ఫ్రాబ్లమ్స్ ఎదురయ్యయనేదే సినిమా కథ.

Hero Karthi

హారిస్ జయరాజ్ మంచి సంగీతం ఇచ్చారు. ముఖ్యంగా ఎస్పీబీ పాడిన పాట సినిమాకే హైలైట్.. రకుల్ నా కాంబినేషన్ మళ్ళీ ప్రేక్షకులను అలరిస్తుంది. రజత్ ఈ సినిమాకి ప్రాణం పెట్టాడు. చాల కష్టపడ్డాడు. ఈ సినిమాలో నటించిన అందరు చాల బాగా నటించారు. డిఫరెంట్ కథ చేసిన ఫీలింగ్ ఉంది నాకు… కాన్ఫిడెంట్‌తో చెప్తున్నాను ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. మళ్ళీ సక్సెస్ మీట్‌లో మీ అందరిని కలుస్తాను అన్నారు.

- Advertisement -