ట్రిపుల్ తలాక్ బిల్లుపై మోదీ కామెంట్స్..

457
- Advertisement -

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. నాలుగు గంటల పాటు వాడీ వేడి చర్చ అనంతరం ఓటింగ్‌ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. లెక్కింపు అనంతరం బిల్లు ఆమోదం పొందినట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

pm modi

మోదీ స్పందింస్తూ.. ముస్లిం మహిళల పట్ల ఓ చారిత్రక తప్పిదాన్ని పార్లమెంటు సరిచేసిందని వ్యాఖ్యానించారు. మధ్యయుగాల నాటి మూఢాచారం చివరికి చరిత్ర చెత్తబుట్టలోకి చేరిందని ట్వీట్ చేశారు. లింగ వివక్షకు వ్యతిరేకంగా ఇది గొప్ప విజయం అని మోదీ అభివర్ణించారు. భారత్ ఉప్పొంగిపోయే సుదినం అని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు సహకరించిన పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -