భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏంచేసినా అభిమానులకు కొత్తగానే ఉంటుంది. ఎప్పుడూ మీడియా మోదీని కెమెరాలతో క్లిక్‌మనిపించడమే చూస్తుంటాం కానీ.. సరదాగా ఈసారి మోదీనే కెమెరా చేతపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరుగుతున్న 16వ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి మోదీ హాజరయ్యారు.ఈ సందర్భంగా మోదీ నందన్‌వన్ జంగిల్ సఫారీకి వెళ్లారు. అక్కడి పులులను ఫొటో తీస్తూ సరదాగా గడిపారు. ఈ ఫొటోలను మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన వెంట చత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ కూడా ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు.. ఇవాళ రాష్ట్ర ప్రజలకు పండుగరోజని, ఈ సమయంలో తాను ఇక్కడ గడపడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఇవాళ ఛత్తీస్‌గఢ్ ప్రజలు అటల్ బిహారీ వాజ్‌పేయ్‌ని గుర్తు చేసుకోవాలని అన్నారు. 2000 సంవత్సరంలోనే ఆయన హయాంలో ఛత్తీస్‌గడ్‌తోపాటు ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ర్టాలు ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేశారు. వేడుకల సందర్భంగా మోడీ.. నయా రాయ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన 15 అడుగుల ఎత్తు ఉన్న పండిత్ దీన్ దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
#WATCH Prime Minister Narendra Modi at the Nandan Van Jungle Safari in Naya Raipur (Chhattisgarh), earlier today pic.twitter.com/WJV2w7nKcr
— ANI (@ANI) November 1, 2016