వీడు మహా మాస్ గాడు అంటున్న నైజాం పిల్లోడు…….

234
online news portal
- Advertisement -

వైష్ణవి మూవీస్, సొహాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బాల్వాన్ ,ప్రాచి అధికారి హీరో, హీరోయిన్లుగా కృష్ణ మోహన్ దర్శకుడిగా నిర్మాత సునీల్ సాగర్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ చిత్రం నైజాం పిల్లోడు (వీడు మహా మాస్ గాడు) ఈ చిత్రం 60% టాకీ పూర్తి చేసుకొంది. ఈ సందర్బంగా నిర్మాత సునీల్ సాగర్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఈ చిత్రంలో ఏడు పాటలు ,ఐదు ఫైట్లు ఉన్నాయని నవంబర్ ఆడియోని ,జనవరి లో సినిమాని విడుదల చేస్తామన్నారు.

online news portal

దర్శకుడు కృష్ణమోహన్ మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా 47సినిమాల్లో సోలో ఫైటర్ గా నటించిన మాజీ జాతీయ బాడీ బిల్డర్ బాల్వాన్ హీరో గా దిపాత్రబినయం చేస్తున్నారని భారీ యాక్టన్ సీన్స్ డూప్ లేకుండా అద్భుతంగా చేసారని ,యస్.కె.మజ్ను సంగీతసారధ్యంలో ఏడు పాటలు అద్భుతంగా ఉంటాయన్నారు . ఇంకా ఈ చిత్రంలో సత్యప్రకాష్, జీవా,అన్నపూర్ణ ,ప్రసన్నకుమార్ ,దిల్ రమేష్,బండ జ్యోతి ,సంపత్ రాజ్ ,నందిని ,పావలా శ్యామల నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా యాదగిరి ఫైట్స్ సూపర్ ఆనంద్ ,నందు ,ఎడిటింగ్ సాయిశ్రీనివాస్,సహా నిర్మాతలు :యం .భాగ్యలక్మి ,కె .ఫిష్ లక్ష్మి ,నిర్మాత సునీల్ సాగర్ ,కథ, మాటలు, పాటలు,స్క్రీన్ ప్లే ,సంగీతం:ఎస్.కె మజ్ను ,దర్శకత్వం కృష్ణమోహన్

online news portal

- Advertisement -