సునీతా విలియమ్స్‌కు ప్రధాని లేఖ

17
- Advertisement -

వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు లేఖ రాశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్‌కు రావాలని సునీతను ఆహ్వానించిన ప్రధాని…దేశ ప్రజల తరపున శుభాకాంక్షలు చెప్పారు. సునీతా విలియమ్స్‌ విధి నిర్వహణలో చూపుతున్న నిబద్ధత పట్ల ఎంతో గర్వపడుతున్నామని వెల్లడించారు.

తాను అమెరికా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బైడెన్‌ను కలిసినప్పుడు సునీతా విలియమ్స్‌ యోగక్షేమాల గురించి ఆరా తీశానని అన్నారు. 140 కోట్ల మంది భారతీయులు సునీతా విలియమ్స్‌ విజయాల పట్ల ఎంతో గర్వపడుతున్నారని చెప్పారు.

సునీతా విలియమ్స్‌ ఆరోగ్యం కోసం, ఆమె మిషన్‌లో విజయం సాధించడం కోసం భారత ప్రజలు ప్రార్థిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు ప్రధాని. 2016లో తాను అమెరికా పర్యటన సందర్భంగా ఆయనను, సునీతా విలియమ్స్‌ను కలికున్నట్లు తనకు గుర్తుందని చెప్పారు. సునీతా విలియమ్స్‌ తిరిగి వచ్చిన తర్వాత భారత్‌కు రావాలని కోరారు.

Also Read:ఎస్సీ వర్గీకరణకు చట్టం..కాంగ్రెస్‌దే ఘనత: ఉత్తమ్

- Advertisement -