23న స్మృతి పెళ్లి..ప్రధాని విషెస్

3
- Advertisement -

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మందాన త్వరలో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ నెల 23వ తేదీన, ఆమె తన ప్రియుడు మరియు ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ను వివాహం చేసుకోబోతున్నారు.

వీరి వివాహం సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఒక లేఖను విడుదల చేశారు. వివాహ బంధంలో ఒకరికి ఒకరు అండగా నిలవాలి… మీ ఇద్దరి వైవాహిక జీవితంలో ప్రతీ మెట్టు సంతోషంగా, నూతన ఉత్తేజంతో సాగాలని నేను ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు.

స్మృతి మందాన క్రికెట్ కెరీర్‌కు, పలాష్ ముచ్చల్ సంగీత జీవితానికి సంబంధించిన ప్రస్తావనలు కూడా ఆ లేఖలో ఉన్నాయి.ఈ శుభ సందర్భంగా, దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు మరియు సినీ ప్రముఖులు స్మృతి-పలాష్ జంటకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.

Also Read:నిఖత్‌కు అభినందనల వెల్లువ

- Advertisement -