ప్రపంచ కప్ బాక్సింగ్ లో పత్తా చాటిన నిఖత్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. నిఖత్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. నిఖత్ జరీన్ అద్భుతమైన ప్రతిభను కనబరిచి ప్రపంచ వేదికపై దేశకీర్తిని చాటారు. ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో నిఖత్ మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నానని రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్ ను అభినందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మరోసారి తెలుగు జాతి గౌరవాన్ని ఖండాంతరాలు దాటించిందని ప్రశంసలు గుప్పించారు. ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నామని… ఇప్పటికే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో తెలంగాణ బిడ్డలు పతకాలు సాధించేలా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పొన్నం స్పష్టం చేశారు.
Also Read:’12A రైల్వే కాలనీ’…డిఫరెంట్ జోనర్

