పవన్‌కు శుభాకాంక్షల వెల్లువ

4
- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. అసంఖ్యాక అభిమానుల గుండెల్లో పవన్ చెరగని ముద్ర వేశారని ప్రశంసలు గుప్పించారు. ఏపీలో ఎన్డీయే బలోపేతానికి పవన్ కళ్యాణ్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు ప్రధాని.

ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. అభిమానులు, కార్యకర్తలు, ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్థిల్లాలి మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి…. పాలనలో, రాష్ట్రాభివృద్ధిలో మీ సహకారం మరువలేనిది అన్నారు.

తమ్ముడు పవన్ కు అన్నయ్య చిరంజీవి బర్త్ డే విషెస్ చెప్పారు. చలన చిత్ర రంగంలో అగ్ర నటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అన్నారు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం… ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను… దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఆశీర్వదించారు చిరంజీవి.

Also Read:‘మిరాయ్‌’..ఫాంటసీ ఎంటర్‌టైనర్

- Advertisement -