రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. పీఎం మోదీ ఉన్నతస్థాయి సమీక్ష..

110
- Advertisement -

గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌పై కన్నెర్ర చేస్తున్న రష్యా.. గురువారం యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా పలు ప్రాంతాలపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌ సైనికులు 40 మంది చనిపోయాగా.. సాధారణ పౌరులు పది మంది వరకు మృతి చెందారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ భారత్‌ సాయాన్ని కోరింది. భారత్‌లోని ఉక్రెయిన్‌ రాయబారి ఇగర్ పోలిఖా ఒక ప్రకటన చేశారు. రష్యాతో భారత్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం రీత్యా ఉక్రెయిన్- రష్యా సంక్షోభాన్ని నియంత్రించడంలో భారత్ కీలకంగా వ్యవహరించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌ స్కీలతో సంప్రదింపులు జరపాలని పోలిఖా విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో, శాంతికాముక దేశంగా పేరుగాంచిన భారత్ కు ఇప్పుడు నిజంగా పరీక్షా సమయం అని చెప్పాలి. ఓవైపు రష్యా మిత్రదేశం కావడం, ఉక్రెయిన్ పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలిగేలా ఉండడం భారత్‌ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతోంది. ప్రస్తుతానికి భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ ఉన్నతస్థాయి సమీక్షలో హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యుద్ధ పరిణామాలు, భారత్ పై తక్షణ ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

- Advertisement -