- Advertisement -
ఫ్రాన్స్ లో జరుగుతున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియాకి ‘గౌరవ సభ్య దేశం’ హోదాని ఇచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ వెల్లడించగా భారత దేశానికి ఈ హోదా దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఓ లేఖ విడుదల చేస్తూ…భారతీయ సినిమా గొప్పతనం, ఇక్కడ సినిమాల చిత్రీకరణకు ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలను భారతదేశం నిర్మిస్తుందని, ఘనమైన సాంస్కృతిక వారసత్వ సంపద ఈ దేశ బలం అని వెల్లడించారు.
నైపుణ్యం ఉన్న మానవ వనరులు, ప్రకృతి అందాలు ఉన్న భారతదేశం ప్రపంచ దర్శక నిర్మాతలకు నచ్చుతుందని…ఇక్కడికి వచ్చి సినిమాలు తీయాలని విదేశీ నిర్మాతలకు ఆహ్వానం పంపారు.
- Advertisement -

