అప్పుడు పీవీ.. ఇప్పుడు మోడీ

28
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే హకీంపేటకు చేరుకున్న మోడీకి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా కాజీపేట అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ పరిశ్రమ, పీవోహెచ్ లకు, జాతీయ రహదారులతో కలిసి మొత్తం రూ.6,109 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేయనున్నారు.

ఇక ప్రధాని హోదాలో వరంగల్‌కు వస్తున్న రెండో ప్రధాని మోడీ. 1994 సంవత్సరంలో ప్రధానిగా పీవీ వరంగల్‌లో పర్యటించారు. దాని తర్వాత అంటే దాదాపు 29 ఏళ్ల తర్వాత ప్రధాని వరంగల్‌కు వస్తున్నారు.

వరంగల్ జిల్లాకు ప్రధాని హోదాలో 1994 సంవత్సరంలో పీవీ నర్సింహారావు వచ్చారు. ఆ తరువాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రధానులెవరూ రాలేదు. 29ఏళ్ల తరువాత ప్రధాని మోదీ వరంగల్ జిల్లాకు వస్తున్నారు.

ప్రధాని టూర్ షెడ్యూల్..

()ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో యూపీలోని వారణాసి నుంచి ప్రధాని మోదీ బయలుదేరుతారు. 9.25గంటలకు హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
()9.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 10.15 గంటలకు మామునూర్ హెలిప్యాడ్ కు ప్రధాని మోదీ చేరుకోనున్నారు.
() అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రకాళి టెంపుల్ కు 10.30 గంటలకు చేరుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 10.45 గంటల వరకు ప్రధాని ఆలయంలో ఉంటారు.
()10.50 గంటలకు భద్రకాళి దేవాలయం నుంచి బయలుదేరి 11గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ కు చేరుకుంటారు.
() 11.35 గంటల వరకు వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు.
() 11.45 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.20 వరకు ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొంగారు.
() మధ్యాహ్నం 12.25 గంటలకు మోదీ రోడ్డు మార్గం ద్వారా హెలిప్యాడ్ వద్దకు వెళ్తారు.
()1.10 గంటలకు హెలికాప్టర్ ద్వారా హకీంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.15 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 3.25 గంటలకు రాజస్థాన్ లోని బికనీర్ కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకుంటారు.

- Advertisement -