క్షతగాత్రులను పరామర్శించిన మోదీ..

6
- Advertisement -

విమాన ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అహ్మదాబాద్‌లో నిన్న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులు. ప్రమాద ఘటన వివరాలను ప్రధాని మోదీకి వివరించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.

శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌ చేరుకుని విమాన ప్రమాదం నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించారు. జూన్ 12న మధ్యాహ్నం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొన్ని నిమిషాలకే AI171 విమానం మెఘనీ నగర్‌లోని ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కూలిపోయింది.

ఈ విమానంలో మొత్తం 241 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు,53 మంది బ్రిటిష్ పౌరులు,7 మంది పోర్చుగీసు పౌరులు,1 కెనడియన్ పౌరుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒక బ్రిటిష్ పౌరుడు మాత్రమే జీవించి బయటపడ్డారు. ఈ విమానాన్ని కెప్టెన్ సుమీత్ సబర్వాల్ నడిపారు. ఆయనకు 8,200 గంటల పైలట్ అనుభవం ఉంది. ఆయనకు తోడుగా ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్, 1,100 గంటల ఫ్లయింగ్ అనుభవంతో, సహాయంగా ఉన్నారు.

Also Read:ఆలస్యం..ఆమె ప్రాణాలను కాపాడింది!

- Advertisement -