ఆరు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమావేశం…

92
pm modi
- Advertisement -

దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఆరు రాష్ట్రాల త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఒడిషా, కేర‌ళ రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశ‌మ‌య్యారు. మొత్తం కేసుల్లో 80 శాతం ఈ రాష్ట్రాల నుంచే వెలుగుచూస్తుండ‌టంతో ఆయా రాష్ట్రాల్లో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు.

థ‌ర్డ్ వేవ్ ముంచెత్త‌నుంద‌నే అంచ‌నాల న‌డుమ కేసుల భారం అధికంగా ఉన్న రాష్ట్రాలు వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి క‌ఠిన చ‌ర్య‌లు చేపట్టాల‌ని కోరారు. ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం, కాంటాక్టు ట్రేసింగ్‌, చికిత్స, వ్యాక్సినేష‌న్‌ల‌పై దృష్టిసారించాల‌ని అన్నారు. కేంద్రం ఇటీవ‌ల ప్ర‌క‌టించ‌ని కొవిడ్ అత్య‌వ‌స‌ర ప్యాకేజ్ నిధుల‌ను ఉప‌యోగించుకుని రాష్ట్రాలు త‌మ ఆరోగ్య మౌలిక వ‌స‌తుల‌ను మెరుగుపరుచుకోవాల‌ని ప్ర‌ధాని సూచించారు.

దేశంలో కేసుల సంఖ్య త‌గ్గుతున్న‌ద‌నే అల‌స‌త్వం ప‌నికిరాద‌ని …థ‌ర్డ్ వేవ్ దేశాన్ని తాకుతుంద‌నే అంచ‌నాల న‌డుమ ఉన్నామ‌ని కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -