ప్రపంచంలో కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత్‌లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించినట్లు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా 13 రాష్ట్రాల్లో 80 జిల్లాల్లో లాక్ డౌన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసహనం వ్యక్తం చేశారు. చాలా మంది ఇప్పటికీ లాక్‌డౌన్‌ను తీవ్రంగా పరిగణించడం లేదని మోడీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
దయచేసి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ కుటుంబాన్ని రక్షించుకోండి. సూచనలను పాటించండి, నియమాలు, చట్టాలను అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నాను అని ప్రధాని తెలిపారు. ఇటలీ, ఇరాన్, స్పెయిన్ అనుభవాలను మరిచిపోవద్దు. మూడు దేశాల్లో జరుగుతున్న నష్టాన్ని చూసి కళ్లు తెరవండి. దేశ క్షేమం కోసం లాక్‌డౌన్ పాటించాలని ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని మోదీ ప్రకటించారు.
लॉकडाउन को अभी भी कई लोग गंभीरता से नहीं ले रहे हैं। कृपया करके अपने आप को बचाएं, अपने परिवार को बचाएं, निर्देशों का गंभीरता से पालन करें। राज्य सरकारों से मेरा अनुरोध है कि वो नियमों और कानूनों का पालन करवाएं।
— Narendra Modi (@narendramodi) March 23, 2020