ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై మోదీ

17
- Advertisement -

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. కొత్తగా గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు.

ప్రజలతో మమేకమై బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం..శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అన్నారు మోదీ. ఏపీలోనూ ఎన్డీఏ అభ్యర్థుల విజయంపై మోదీ అభినందనలు చెప్పారు .

కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్-మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి చిన్నమైల్​ అంజిరెడ్డి గెలుపొందారు . రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని విజయం వరించింది.

Also Read:విదేశీ విద్యా పథకం నిధులేవి: హరీష్ రావు

- Advertisement -