భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. భాగ్యనగరంలో జరిగే రెండు ప్రధాన ఘట్టాలకు ఆయన హాజరుకానున్నారు. మొదట మెట్రోరైల్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు.
మోడీ ఇవాల్టి పర్యటన షెడ్యూల్..
మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు మోదీ చేరుకోనున్నారు. అక్కడి నుండి మధ్యాహ్నం 2.05 గంటలకు మియాపూర్ చేరుకొని మధ్యాహ్నం 2.23కు మెట్రో పైలాన్‌ను ఆవిష్కరణలో పాల్గొంటారు. ఆడియో ఏవీలు చూసి, మెట్రో రైలు బ్రోచర్, యాప్‌ను విడుదల చేస్తారు. అనంతరం మియాపూర్-కూకట్‌పల్లి-మియాపూర్ వరకు మెట్రో రైలులో ప్రయాణం చేస్తారు. మధ్యాహ్నం 3.15 గంటలకు హెచ్‌ఐసీసీ చేరుకుంటారు ప్రధాని. మధ్యాహ్నం 3.35 నుంచి 3.55 వరకు 20 నిమిషాల పాటు ఇవాంకా ట్రంప్‌తో భేటీ అవుతారు. అక్కడి 4 నుంచి 4.25 గంటల వరకు ప్రధాని మోదీని కలవనున్న భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు. 4.40 నుంచి 4.43 వరకు జీఈఎస్‌లో సీఎం కేసీఆర్ స్వాగతోపన్యాసం. 4.43కు అధికారికంగా జీఈఎస్ సదస్సు ప్రారంభం. 4.45 నుంచి 4.50 వరకు ఇవాంకా ఉపన్యాసం. 4.50 నుంచి 5.10 వరకు మోదీ ప్రసంగం. ఆ తర్వాత కృతజ్ఞతలు తెలుపుతూ కేంద్రమంత్రి సుష్మా ప్రసంగం.
సాయంత్రం 5.30-5.48 వరకు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల బృందాలతో మోదీ సమావేశం అవుతారు. సాయంత్రం 5.56 నుంచి 6.03 వరకు గ్రూప్ మీటింగ్‌కు హాజరుకానున్న మోదీ. సాయంత్రం 6.03-6.32 వరకు నలుగురు పారిశ్రామిక దిగ్గజాలతో మోదీ భేటీ కానున్నారు. సాయంత్రం 6.32- 7గంటల వరకు రౌండ్‌టేబుల్ భేటీలో పాల్గొంటారు మోదీ. రాత్రి 8 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్ బయల్దేరనున్న మోదీ రాత్రి 8 నుంచి 10 వరకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఉంటారు. రాత్రి 8.05-8.20 వరకు ట్రీఆఫ్ లైఫ్ పేరుతో ఫలక్‌నుమా ప్యాలెస్‌లో భారతీయకళలు, దుస్తుల ప్రదర్శన 8.20 నుంచి 8.35 వరకు భారత చారిత్రక వారసత్వంపై లైవ్ షో ఉంటుంది. రాత్రి 8.45 నుంచి 9.50 వరకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు 10.25 గంటలకు ప్రధాని మోదీ ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.