ఈ-రూపీ విధానాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..

134
modi
- Advertisement -

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ-రూపీని సోమవారం విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈ-రూపీని తీసుకువచ్చింది. ఈరోజు నుంచి ప్రజలకు ఈ-రూపీ విధానం అందుబాటులోకి వస్తోంది. నగదు రహిత, కాంటాక్ట్ లెస్ ఆర్థిక లావాదేవీల కోసం ఈ-రూపీ విధానానికి రూపకల్పన చేశారు.

ఈ విధానంలో చెల్లింపులు ఎలా ఉంటాయంటే… మొబైల్ ఫోన్ కు ఈ-రూపీ క్యూఆర్ కోడ్, ఎస్సెమ్మెస్ స్ట్రింగ్ ఓచర్ వస్తాయి. ఈ రెండింటి సాయంతో చెల్లింపులు జరపవచ్చని, ఇది ఎంతో సురక్షితమైన విధానం అని కేంద్రం వెల్లడించింది. ఇంటర్నెంట్ బ్యాంకింగ్, కార్డులు, యాప్ లతో సంబంధం లేకుండా లావాదేవీలు జరపవచ్చని వివరించింది. ప్రస్తుతం 8 బ్యాంకుల ద్వారా ఈ-రూపీ సేవలు అందించనున్నారు.

భారత జాతీయ చెల్లింపుల సాధికార సంస్థ రూపకల్పన చేసిన ఈ-రూపీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య సాధికార సంస్థ సహకారం ఉంది. ఇప్పటికే ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎ్‌ఫసీ, యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎన్‌పీసీఐతో ఈ-రూపీ కోసం ఎన్‌పీసీఐతో ఒప్పందం కుదర్చుకున్నాయి.

- Advertisement -