అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ భేటీ..

139
modi

దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఈ నెల 17న వర్చువల్ విధానంలో సీఎంలతో సమావేశం నిర్వహించనున్నారు. కొత్త కేసుల సంఖ్య వృద్ధి, కరోనా నివారణ, నియంత్రణ చర్యలపై వారితో చర్చించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది.

ఇక దేశవ్యాప్తంగా అమలవుతున్న కరోనా వ్యాక్సినేషన్ పై సీఎంల అభిప్రాయాలు అడిగి తెలుసుకోనున్నారు. కాగా, ఇప్పటికే పలు రాష్ట్రాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. మహారాష్ట్రతో పాటు కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్, రాత్రి సమయంలో కర్ఫ్యూను విధిస్తూ కరోనాను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ఏం చర్యలు తీసుకుంటే కరోనాను కట్టడి చేయవచ్చన్న సమాలోచనలు ప్రధాని మోడీ జరపనున్నారు. అలానే కరోనా వ్యాక్సిన్ వేగవంతం ప్రక్రియ గురించి కూడా చర్చించే అవకశం కనిపిస్తోంది.