కొవిన్‌ యాప్‌పై అంతర్జాతీయ సదస్సు

127
pm modi
- Advertisement -

కొవిన్ యాప్‌పై నేడు అంతర్జాతీయ సదస్సు జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌గా జరగనున్న ఈ సదస్సులో కొవిన్‌ యాప్‌కు సంబంధించిన అనుభవాలను ప్రధాని మోదీ పంచుకోనున్నారు. కెనడా, మెక్సికో, పనామా, పెరూ, అజర్‌బైజాన్, ఉక్రెయిన్, నైజీరియా, ఉగాండా, వియత్నాం, ఇరాక్, డొమినికన్ రిపబ్లిక్, యూఏఈ వంటి దేశాలు ఇప్పటికే కొవిన్‌ యాప్‌ వంటి ప్లాట్‌ఫామ్‌ను తమ దేశాల్లో అందుబాటులోకి తీసుకురావడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి.

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ గత జనవరిలో ప్రారంభమైంది. అప్పుడే కొవిన్‌ యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వ్యాక్సిన్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. దీనిద్వారా వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులకు టీకా ఇచ్చే సమయం, కేంద్రాలను తెలుసుకోవడం వంటి సేవలను తెలుసుకోవచ్చు.

- Advertisement -