Modi:ట్రంప్‌కు మోదీ కృతజ్ఞతలు!

4
- Advertisement -

భారత్‌పై విధించిన సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని వాషింగ్టన్ నిర్ణయించిన నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ నాయకత్వం ప్రపంచ శాంతి, స్థిరత్వం, సమృద్ధికి అత్యంత అవసరమని ఆయన అన్నారు.

శాంతి సాధనకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు భారత్ పూర్తిగా మద్దతు ఇస్తుందని ప్రధాని ఎక్స్‌ లో చేసిన పోస్టులో తెలిపారు. భారత్–అమెరికా భాగస్వామ్యాన్ని ఎన్నడూ లేని స్థాయికి తీసుకెళ్లేందుకు ఆయనతో సన్నిహితంగా పనిచేయాలని ఎదురుచూస్తున్నానని చెప్పారు.

ఈ రోజు నా ప్రియ మిత్రుడు అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై ఇప్పుడు 18 శాతం మాత్రమే సుంకం ఉండబోతుండటం సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రకటన చేసినందుకు భారతదేశంలోని 140 కోట్ల ప్రజల తరఫున అధ్యక్షుడు ట్రంప్‌కు పెద్ద ధన్యవాదాలు అని మోదీ అన్నారు.

ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే, అది మన ప్రజలకు లాభాన్ని చేకూరుస్తుంది అన్నారు. ఈ సందర్భంగా భారత్ ఇకపై రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు నిలిపివేస్తుందని కూడా ప్రకటించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని ట్రంప్ ఎప్పటినుంచో విమర్శిస్తూ, అది ఉక్రెయిన్ యుద్ధానికి ఇంధనం అందిస్తోందని ఆరోపణలు చేశారు. అలాగే భారత్ త్వరలో వెనిజువెలా నుంచి చమురు కొనుగోలు ప్రారంభిస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు.

Also Read:ఐసీసీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం: బీసీసీఐ

- Advertisement -