వినతుల ఊసెత్తని ప్రధాని..

133
modi
- Advertisement -

పెండింగ్ సమస్యల ప్రస్తావనే లేదు,
తెలంగాణ సర్కారు హామీల్లేవ్
బకాయిల ఊసెత్తని ప్రధానమంత్రి,
విభజన సమస్యలపై స్పందనే లేదు
రాజకీయాలకే ప్రాధాన్యతనిచ్చిన పీఎం,
నిరాశ కలిగించిన పీఎం ప్రసంగం

కేంద్రప్రభుత్వం పద్ద పెండింగ్లో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యల్లో ఏ ఒక్క సమస్యనైనా వరిష్కరిస్తానని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఒక్కమాట కూడా చెప్పకపోవడంపై ప్రభుత్వపర్గాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకొన్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు ప్రధానమంత్రి వర్యటనలో భాగంగా అనేక పరాలు కురిపిస్తారని బావించామని, కానీ కొత్తగా ఎలాంటి పరాలు ఇవ్వకపోయినా కనీసం కేంద్ర ప్రభుత్వం పద్ద పెండింగ్ లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమస్యలనైనా పరిష్కరిస్తామని ప్రధానమంత్రి బేగంపేట్ ఎయిర్‌పోర్టులో జరిగిన సభలోగానీ, రామగుండంలో జరిగిన సభలోగానీ ప్రకటన చేస్తారేమోనని టీవీలకు అతుక్కుపోయి పీఎం ప్రసంగాన్ని విన్నాపుని, కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదని సీనియర్ అధికారులు తీవ్ర వేదన వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి ప్రసంగం యాపత్తూ రాజకీయవరమైన విషుర్శలు, బెదిరింపులకే వరిమితంగా ఉందేగానీ తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధికిగానీ, ప్రజల సంక్షేమానికి కేంద్రం ఏం చేయబోతోందో మాత్రం చెప్పకపోపడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధాని పచ్చారు… వెళ్ళారు… కానీ ఆయన పర్యటన మూలంగా తెలంగాణకు ఒరిగిందేమీ లేదనే విపుర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. అదే విధంగా శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సభల్లో ఆ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని, అందుకు అవసరమైన సంపూర్ణ సహాయ, సహకారాలను అందిస్తామని, ముఖ్యంగా ఓడరేవుల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని స్పష్టమైన హామీని ఇచ్చిన ప్రధాన మంత్రి సుధ్యాహ్నం బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడ బిజెపి నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన బహిరంగ సభలోగానీ, రామగుండంలో నిర్వహించిన సభలోగానీ తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసే ఎలాంటి ప్రకటన కూడా చేయకపోవడం బాధాకరపుని ఆ అధికారులు ఆవేదన వ్యక్తంచేశారు.

ఎమిదేళ్ళుగా రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించకుండా వెండింగ్ లో పెట్టిన మనత కేంద్ర ప్రభుత్వానిదేనని, కనీసం విభజన సమస్యలనైనా వరిష్కరిస్తామని సీఎం చెప్ప లేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 495 కోట్ల 20 లక్షల రూపాయల నిధులను కేంద్రం చేసిన పొరపాటుతో ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళాయని, ఆ నిధులను కూడా కేంద్రం ఇప్పటి వరకూ విడుదల చేయలేదని, కనీసం ఈ కొద్దిపాటి నిధులను కూడా ఇస్తానని సీఎం చెప్పకపోతే ఎలా..? అని ప్రశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలపరం ప్రాజెక్టు షూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా 120 కిలోమీటర్ల పరకూ ముంవు నపున్య ఉందని నిర్ధారణ అయ్యిందని, కనీసం తెలంగాణ ప్రాంతంలో ముందు సమస్యను తొలగించడానికి శాశ్వత పరిష్కారానికి కేంద్రం ఏం చేయబోతోందో కూడా ప్రధాని చెప్పకపోవడం విచారకరని అంటున్నారు. సాధారణంగా దేశ ప్రధాని ఏ ప్రాంతానికైనా వెళుతున్నారంటే అక్కడి స్థానిక సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి కనీసం ఒక్కమాట మాట్లాడి ప్రజలను ఊరడింవ జేస్తారని,రామగుండం వక్కనే గోదాపరి నది ఉందని, కనీసం ఇటీవల సంభవించిన పరదల్లో రామగుండం ప్రాంతం కూడా ముంవు సమస్యను ఎదుర్కొందని, ప్రధానమంత్రి ఆ సమస్యనైనా అడ్రస్ చేసి ఉంటే బాగుండేదని ఆ అధికారులు విపరించారు. రాష్ట్రంలో నిర్మాణంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన క్లియరెన్స్ లు ఇవ్వకుండా కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖాధికారులు ఫైళ్ళను తొక్కిపెట్టారని, కనీసం క్లియరెన్స్ లను జారీ చేయిస్తానని కూడా ప్రధానమంత్రి ఒక చిన్న హామీ కూడా ఇవ్వలేదని, ఈ క్లియరెన్లు ఇవ్వడం మూలంగా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఖర్చుల్లేపని, ప్రాజెక్టులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే నిర్మించుకుంటోందని, కేవలం క్లియరెన్లు ఇవ్వడానికి నెలలు, సంపత్సరాల తరబడి ఫైళ్ళను వెండింగ్లో పెట్టుకోపడం మునుపెన్షడూ లేదని,కేంద్రంలోని ఇప్పటి ప్రభుత్వమే ఇలా ప్రాజెక్టుల క్లియరెన్స్లో వెళ్ళను వెండింగ్లో పెట్టిందని ఆ సీనియర్ అధికారులు విపరించారు. విభజన చట్టంలో పొందువరిచిన గిరిజన యూనిపర్శిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను తెలంగాణ రాకుండా గుజరాత్ కు తరలించుకుపోయిన విషయంపై వివాదాలు నడుస్తున్నాయని, అందుకు తగిన విపరణ ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

ఇక కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్ల రూవంలో ఇవ్వాల్సిన 34,149 కోట్ల రూపాయల నిధులనైనా విడుదల చేస్తారా.. అంటే అదీ లేదని, మొత్తం నిధులను ఒకేసారి కాకపోయినా కనీసం దశల వారీగానైనా నిధులిస్తామని కూడా ప్రధానమంత్రి హోదాలో రాష్ట్రానికి పచ్చిన వ్యక్తి కనీసం మాట మాత్రం కూడా చెప్పలేదని ఆ అధికారులు ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీతి ఆయోగ్, ఆర్ధిక సంఘాల సిఫారసులను ఇతర రాష్ట్రాల్లో అపులు చేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక్క తెలంగాణ రాష్ట్రం విషయంలో ఆ సంస్థల సిఫారసులను అమలు చేయడం లేదనే విషుర్శలకు కూడా ఎలాంటి జవాబు రాలేదని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ 14వ ఫైనాన్స్ కమీషన్ సిఫారసుల ప్రకారం తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 315 కోట్ల 32 లక్షల రూపాయలు, వట్టణ స్థానిక సంస్థలకు 502 కోట్ల 61 లక్షల రూపాయలు కలిపి స్థానిక సంస్థలకు 817 కోట్ల 61 లక్షల రూపాయల నిధులను గ్రాంట్ రూపంలో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంపత్సరానికి 450 కోట్ల రూపాయల లెక్కన గడచిన మూడేళ్ళకు కలిపి 1,350 కోట్ల రూపాయల నిధులను కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్ ఇవ్వాల్సి ఉంది. 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు వన్నుల వాటాలో తెలంగాణకు ఇవ్వాల్సిన 723 కోట్ల రూపాయలను ఇప్పటి పరకూ ఇవ్వలేదు. 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల ప్రకారం న్యూట్రిషన్ రంగంలో తెలంగాణకు పురో 171 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాల్సి ఉంది. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు 15వ ఆర్థిక సంఘం 3,024 కోట్ల రూపాయల నిధులను గ్రాంటుగా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసిందని, ఆ నిధులను కూడా ఇప్వలేదు. మిషన్ భగీరథ పథకానికి 15వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి మరో 2,350 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది.

ఇప్పటికీ అతీగతీ లేదు. ఇదిలావుండగా నీతి ఆయోగ్ సంస్థ కూడా మిషన్ భగీరథ పథకానికి 19,205 కోట్ల రూపాయలను గ్రాంటుగా తెలంగాణకు ఇవ్వాలని సిఫారసు చేసిందని, అంతేగాక మిషన్ కాకతీయ పథకానికి మరో అయిదు వేల కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని కూడా సిఫారసు చేసినప్పటికీ కేంద్రం ఒక్క రూపాయిని కూడా గ్రాంట్ గా ఇవ్వలేదు. 2021-22ప ఆర్ధిక సంపత్సరానికి తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 682 కోట్ల 50 లక్షల రూపాయలు, వట్టణ స్థానిక సంస్థలకు 331 కోట్ల 40 లక్షల రూపాయల నిధులను గ్రాంటుగా ఇవ్వాల్సిన కేంద్రం ఇప్పటి పరకూ ఆ ఊసెత్తడం లేదని తెలిపారు. ఇలా మొత్తం కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్ల రూవంలో రావాల్సిన 34,149 కోట్ల 71 లక్షల రూపాయల నిధులు ఇవ్వడం లేదని, ఈ అంశాలపై ప్రధానమంత్రి, కేంద్ర ఆర్ధిక మంత్రి ఇతర మంత్రులకు విన్షపాలు, విజ్ఞావనలు ఇచ్చినప్పటికీ ఎలాంటి సానుకూల సమాధానాలు రాలేదని, కనీసం వాటివైన ఊరడింపు మాటలు కూడా ప్రధాని మాట్లాడకపోవడం బాధాకరమని అంటున్నారు.

ఇవి కూడా చదవండి..

పోలవరం…తెలంగాణకు ప్రాణసంకటం

తొలి అడుగు తెలంగాణలోనే

కన్నతల్లిని జన్మభూమిని మరువద్దు…సంతోష్‌

- Advertisement -