సిసిసి కోసం నాగ చైతన్య 25 లక్షల విరాళం..

257
Naga Chaitanya

కరోనా ను నియంత్రించడానికి పాటిస్తున్న 21 రోజుల లాక్ డౌన్ వలన సినీ పరిశ్రమ స్తంభించింది. షూటింగులు లేక ఇబ్బంది పడుతున్న పేద సినీ కార్మికుల కోసం సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి నాగ చైతన్య 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

మనకి రోజూ తోడుండే రోజువారీ సినీ వర్కర్స్ కి సహాయం చేయడం కోసం పరిశ్రమ పూనుకోవడం తనని కదిలించిందని, తన వంతుగా వారికి 25 లక్షల రూపాయల సహాయం అందిస్తున్నట్టు, ఇలాంటి సమయంలో అందరం కలిసికట్టుగా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని నాగ చైతన్య అన్నారు.