మోదీ ఏరియల్‌ సర్వే..కెరళకు రూ.500 కోట్లు..

224
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోది నేడు కేరళలో ఏరియల్‌ సర్వే చేపట్టారు. శనివారం ఉదయం కొచ్చి చేరుకున్న మోదీ.. ఏరియల్ సర్వే ద్వారా వరద పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలోనే ప్రధాని, కెరళకు తక్షణ సాయంగా రూ.500 కోట్ల ప్రకటించారు.

అయితే వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కెరళ రాష్ట్రంలో, ఏరియల్ సర్వేకు సిద్దమైన మోదీ..వాతావరణ కారణంగా ఏరియల్‌ సర్వేను రద్దు అవడంతో కేరళ సీఎం పినరయి విజయన్‌తో కలిసి మోదీ రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో గవర్నర్‌ పి సదాశివంతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ప్రతికూల పరిస్థితుల్లోనే మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు.

PM Modi

వరద నీటిలో మునిగిపోయిన పట్టణాలు, గ్రామాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వరదల వల్ల చనిపోయివారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 50వేలు ఇస్తామని వెల్లడించారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నారు.

- Advertisement -