జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిపై స్పందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కలలో కూడా ఊహించని విధంగా ఉగ్రవాదులను శిక్షిస్తామని స్పష్టం చేశారు. బీహార్‌లోని మధుబనిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ..ఉగ్రమూకలకు, వారిని ప్రోత్సహిస్తున్న వారికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదని, భారత్‌పై జరిగిన దాడిగా భావిస్తున్నామని అన్నారు. ఉగ్రవాదానికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేశారు. ఈ దాడికి పాల్పడిన వారితో పాటు, దాడి వెనకున్న కుట్రదారులను కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని అన్నారు.
భారత్ ఆత్మపై దాడి చేసే దుస్సాహసం చేశారు… ప్రపంచానికి మేము చెప్పేది ఒక్కటే.. ఉగ్రవాదులను, వారికి సాయమందించిన వారందరికీ గుర్తించి శిక్షిస్తాము. భూమి అంచుల వరకూ వారిని వెంటాడి పట్టుకుంటాము. ఉగ్రవాదంతో భారత్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు అన్నారు. టెర్రరిజంపై పోరులో భారత్ ఏకతాటిపై ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read:Guardian:ఓటీటీలోకి గార్డియన్!

