యోగా మన జీవక్రియను శక్తివంతంగా చేస్తుందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. రోగాలను దీటుగా ఎదుర్కొనేందుకు యోగా దోహదపడుతుందని ప్రధాని మోదీ ప్రకటించారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్ ద్వారా జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. యోగా చేయడం ద్వారా శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి యోగా చేయాలని పిలుపునిచ్చారు.
కరోనా వైరస్ మన శ్వాసవ్యవస్థపై త్రీవ ప్రభావం చూపుతుందని, శ్వాస వ్యవస్థను బలోపేతం చేసేందుకు యోగాలో అనేక ఆసనాలున్నాయని చెప్పారు.యోగా ద్వారా శాంతి, సహనశక్తి, మనోధైర్యం, ఉల్లాసం పెంపొందుతాయని చెప్పారు. రోజువారీ దినచర్యలో ఈ యోగాసనాన్ని భాగం చేసుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా రోగాల బారిన పడిన చాలా మంది యోగాసనాల ద్వారా లబ్దిని పొందుతున్నారు. యోగా చేయడం వల్ల మనుషుల్లో మానవత్వం పెరుగుతుందని అన్నారు. కాగా ప్రధాని పిలుపు మేరకు యోగా దినోత్సవం సందర్భంగా పలువురు నేతలు ఇంట్లో కుటుంబ సభ్యులతో యోగా చేస్తున్నారు. ఈఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.