Modi:బిహార్ గడ్డపై హామీ ఇచ్చా..నెరవేర్చా

5
- Advertisement -

ఊహించని రీతిలో పాక్​ను దెబ్బకొట్టాం అని మరోసారి స్పష్టం చేశారు. బిహార్ పర్యటనలో భాగంగా మాట్లాడిన మోదీ…ఉగ్రవాదుల స్థావరాలు శిథిలాలుగా మార్చామని, నిమిషాల్లోనే పాకిస్థాన్ ఎయిర్ బేస్​లను ధ్వంసం చేశామన్నామని ఇదే నవ భారత బలమని చెప్పారు. ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేస్తామని బిహార్ గడ్డపై దేశానికి వాగ్దానం చేశాను. వారికి ఊహకు అందని శిక్ష విధిస్తామని చెప్పాను. నా వాగ్దానాన్ని నేను నెరవేర్చాను అని వెల్లడించారు.

పాకిస్థాన్​లో కూర్చుని మన సోదరీమణుల సిందూరాన్ని చెరిపేసిన వారిని, వారి స్థావరాలను శిథిలాలుగా మార్చింది. పాకిస్థాన్ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం సిందూర శక్తిని చూసింది అన్నారు. పాక్‌ ఆర్మీ నీడలో తాము సురక్షితంగా ఉంటామని ఉగ్రవాదులు భావించారు కానీ మనం ఆ దేశ సైన్యాన్ని మోకాళ్లపై కూర్చోబెట్టాం అని వెల్లడించారు.

ఆపరేషన్‌ సిందూర్‌ భారత్​ అమ్ములపొదిలో కేవలం ఒక బాణం మాత్రమే అని….ఉగ్రవాదంపై మన యుద్ధం ముగియలేదు అని స్పష్టం చేశారు. మరోసారి ఉగ్రదాడి జరిగితే ఈసారి ఆ పాము తలే ధ్వంసమవుతుంది అని స్పష్టం చేశారు.

Also Read:కెనడాలో కార్చిచ్చు కలకలం..

- Advertisement -