పాకిస్తాన్ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ… దేశ ప్రజల క్షేమమే మా ధ్యేయం అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం 140 కోట్ల మంది సంకల్ప పండుగ అని, కోట్లాది మంది త్యాగాలతో స్వాతంత్ర్యం సాధించుకున్నామని అన్నారు.
ఇవాళ సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరే సమయం. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం అన్నారు.పహల్గామ్ దాడితో యావత్ దేశం ఆక్రోశంతో రగిలిపోయింది. ఆ ఆక్రోశానికి సమాధానంగానే ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం అన్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్…. మన వీర జవాన్లు శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టారు…. పహల్గామ్‌లో ఉగ్రవాదులు మతం అడిగి మరీ చంపారు… భార్య, కన్నబిడ్డల కళ్లెదుటే దారుణంగా కాల్చి చంపారు అన్నారు. సింధూ నదిలో నీరు భారత రైతుల హక్కు. సింధూ ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు.
Also Read:LSW:లక్నో సూపర్ జెయింట్స్..ప్రక్షాళన!

