ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం: మోదీ

5
- Advertisement -

ఇంకోసారి ఉగ్రదాడి జరిగితే భారత్ గట్టిగా జవాబు ఇస్తది అన్నారు ప్రధాని మోదీ. ఇంట్లోకి దూరి మరీ చంపుతామని పాకిస్తాన్ ఆర్మీకి కూడా చెప్పాం.. పాకిస్తాన్‌ బ్రతకడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వం అన్నారు. మా డ్రోన్లు, మిస్సైల్స్ గురించి గుర్తొచ్చి పాకిస్తాన్‌కు ఎన్నో రోజులు నిద్ర రాలేదు…మా చెల్లెళ్ళ సిందూరం తుడిచిన ఉగ్రవాదులను వాళ్ళ ఇంట్లోకి దూరి చంపామన్నారు.

‘భారత్ మాతాకీ జై’ నినాదం శత్రువుల చెవుల్లో మార్మోగింది అన్నారు. ఉగ్రవాదం అంతం చూస్తామంటూ ఇండియన్ ఆర్మీ శపథం చేసింది… భారతదేశ డ్రోన్లు, క్షిపణులు యుద్ధంలో ప్రధాన పాత్ర వహించాయి అన్నారు. న్యూక్లియర్ బాంబులతో భయపెట్టినా వెనక్కి తగ్గేది లేదు అన్నారు.

యుద్ధంలో పోరాడిన సైనికులైన మీ దర్శనం కోసమే వచ్చాను… మీ ధైర్య సాహసాలను చూస్తే గర్వంగా ఉంది అన్నారు. పాక్ డ్రోన్లు మన గగనతలాన్ని దాటలేకపోయాయి అన్నారు.

Also Read:BRS:సోషల్ మీడియాలో అసత్య ప్రచారం.. ఫిర్యాదు

- Advertisement -