కాంగ్రెస్‌ నేతకు సెల్యూట్ చేసిన ప్రధాని మోదీ..

147
modi
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత,ఎంపీ గులాం నబీ ఆజాద్‌కు సెల్యూట్‌ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పదవీకాలం ముగుస్తున్న నేతలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ….ఆజాద్ ప్రస్తావన తెచ్చారు.

ఆజాద్ తనకు నిజ‌మైన స్నేహితుడ‌ని…..జ‌మ్మూక‌శ్మీర్ సీఎంగా ఆజాద్ ఉన్న స‌మ‌యంలో ఆయ‌న చేసిన మేలును మరిచిపోన‌ని సెల్యూట్ చేశారు. క‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడి జ‌రిగిన‌ప్పుడు.. అక్క‌డ గుజ‌రాతీ ప‌ర్యాట‌కులు చిక్కుకున్నార‌ని, ఆ స‌మ‌యంలో తాను ఆజాద్ వ‌ద్ద సాయం కోరాన‌ని తెలిపారు. అప్పుడు ఆయన త‌న‌కు అనుక్ష‌ణం వారి గురించి అప్‌డేట్ ఇచ్చార‌ని భావోద్వేగానికి లోన‌య్యారు.

గుజ‌రాతీ ప‌ర్యాట‌కుల‌ను ఆజాద్ ర‌క్షించిన‌ట్లు పేర్కొన్న మోదీ కొన్ని క్ష‌ణాల పాటు దుఖ్కాన్ని ఆపుకునే ప్ర‌య‌త్నించారు. ఉన్న‌త ప‌దవులు వ‌స్తుంటాయి, పోతుంటాయ‌ని, కానీ గులాం న‌బీ నుంచి మ‌నం నేర్చుకోవాల్సింది చాలా ఉంద‌న్నారు.

- Advertisement -