గత కొన్ని రోజులుగా జమిలి ఎలక్షన్స్ పై దేశ వ్యాప్తంగా జరుగుతున్నా చర్చ అంతా ఇంత కాదు. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జమిలి ఎలక్షన్స్ బిల్లు ప్రవేశ పెట్టేందుకే అని, రకరకాల వార్తలు వినిపించాయి. కానీ ఎవరు ఊహించని విధంగా కేవలం ఒక్క మహిళా బిల్లు మాత్రమే ప్రవేశ పెట్టి పార్లమెంట్ సమావేశాలను ముగించింది మోడి సర్కార్. దీంతో ఒక్కసారిగా కొత్త సందేహాలు తెరపైకి వచ్చాయి. మహిళా బిల్లు కోసమే అయితే ఇంత హంగామా ఎందుకు చేయాలని ప్రశ్నిస్తున్నావారు లేకపోలేదు. ఎందుకంటే ఈ పార్లమెంట్ సమావేశాల కంటే ముందు మోడి సర్కార్ చేసిన హడావిడి అలాంటిది మరి.
ఎన్నికల ఖర్చు తగ్గించాలని అందుకే జమిలి ఎన్నికల ప్రతిపాదన చేస్తున్నట్లు స్వయంగా బిజెపి నేతలే పలు మార్లు చెప్పుకొచ్చారు. ఇంకా దేశ పేరు మార్పు కూడా తెరపైకి తెచ్చారు. ఇండియా పదం తీసేసి భారత్ చేర్చే ఆలోచన కూడా చేశారు. వీటన్నికిని వచ్చే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే చేయాలన్నట్లు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ వచ్చింది. కట్ చేస్తే పార్లమెంట్ సమావేశాల్లో ఈ ప్రతిపాదనలేవీ లేకుండానే ముగించింది. దీంతో జమిలి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే జమిలి ఎలక్షన్స్ అమలు చేయడం అంతా తేలికైన విషయం కాదు.
Also Read:Naveen Polishetty:సినిమా సక్సెస్ జోష్‌నిచ్చింది
ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్న మన దేశంలో రాష్ట్రాల వారీగా ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాలను ఒప్పించడం సాధ్యమయ్యే పని కాదనేది కొందరు విశ్లేషకులు చెప్పే మాట. దానికి తోడు అనివార్య కారణాల వల్ల ఏదో ఒక రాష్టంలో ప్రభుత్వం కూలిపోతే అప్పుడు ఎన్నికలు ఎలా నిర్వహించాలనేది కూడా అంతు చిక్కని ప్రశ్నే. అందుకే జమిలి ఎన్నికలు సాధ్యమయ్యే పని కాదని మోడి సర్కార్ వెనక్కి తగ్గినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉంది అనే విధంగానే ప్రధాని మోడి వ్యాఖ్యానిస్తూ వచ్చారు. దీన్ని బట్టి చూస్తే జమిలి ఎలక్షన్స్ గాని ముందస్తు ఎన్నికలు గాని జరిగే అవకాశం లేదని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read:Biden:యుక్రెయిన్‌కి సైనిక సాయం అందిస్తాం!