భారతీయ పరిశ్రమలకు రతన్ టాటా ప్రేరణగా నిలిచారన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ఓ ఆర్టికల్ రాసిన మోదీ… దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటాకు తన వ్యాసంతో నివాళి అర్పించారు.పర్యావరణం, దాతృత్వం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్లు కూడా రతన్ మృతితో విషాదంలో ఉన్నట్లు రాశారు. ఈ దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా రతన్ మరణం అందర్నీ కలిచివేసిందన్నారు.
ప్రపంచస్థాయికి తగ్గట్లుగా బెంచ్‌మార్క్‌లను సెట్ చేయాలని భారతీయ వ్యాపారవేత్తలను రతన్ ప్రోత్సహించినట్లు ప్రధాని తన వ్యాసంలో వెల్లడించారు. ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించడంలో.. రతన్ విజన్.. భారత భవిష్యత్తు నాయకులకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుందని ఆశించారు. బోర్డురూమ్‌లకో లేక మనుషులకు సాయం చేయడమే కాదు.. ఆయన గొప్ప జంతు ప్రేమికుడు అని కూడా తెలిపారు.
యువతకు రతన్ ప్రేరణగా నిలిచారన్నారు. భారతీయ సంప్రదాయాలను ఎందరికో పరిచయం చేశారని, సమగ్రతకు.. సేవకు ఆయన కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. రతన్ నాయకత్వంలో టాటా గ్రూపు కొత్త తీరాలకు వెళ్లిందన్నారు. విశ్వాసం, గౌరవం, నమ్మకాన్ని ఆ సంస్థ పొందిందన్నారు. సాధించిన ఘనతల పట్ల ఆయన వినయంగా ఉండేవారన్నారు. మరొకరి ఆశయాలకు మద్దతు ఇవ్వడం ఆయన ఉత్తమ లక్షణమన్నారు. భారత్ ఐక్యంగా ఉన్నదని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ప్రదర్శించినట్లు మోదీ తెలిపారు.
Also Read:తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటారు!
దేశ ప్రగతిలో పరిశుభ్రత, స్వచ్ఛత, శానిటేషన్ చాలా కీలకమైనవని రతన్ నమ్మేవారన్నారు. హెల్త్‌కేర్ అంశంలోనూ ఆయన రాజీలేని పోరాటం చేశారన్నారు. క్యాన్సర్‌పై పోరాటంలో భాగంగా అస్సాంలో అనేక ఆస్పత్రులను ఓపెన్ చేసినట్లు చెప్పారు. ఆరోగ్యం, క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి తెవాలన్న ఆశయం రతన్‌లో ఉన్నట్లు తెలిపారు.