ప్రధాని మోడీ..రంజాన్ విషెస్

1
- Advertisement -

దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు ముస్లింలకు ప్రధాని మోడీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆశ, సామరస్యం, దయ, స్ఫూర్తిని పెంపొందించాలన ఆకాంక్షించారు. అన్ని ప్రయత్నాల్లో ఆనందం, విజయం కలగాలని పేర్కొన్నారు.

పవిత్ర రంజాన్ మాసం ముగిసిన సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు. ఇది ముస్లింలకు ప్రత్యేకమైన రోజు. ఆదివారం దేశంలో ఈద్ చంద్రుడు కనిపించాడు. దీంతో సోమవారం ఈద్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముస్లిలంద‌రికీ రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, కరుణ, ఐకమత్యం సందేశాలతో సేవాతత్పరత, ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం సందర్భంగా అల్లా కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు.

Also Read:జమ్మూ టూ శ్రీనగర్‌..వందే భారత్ రైలు

- Advertisement -