Modi:రాహుల్‌కు వర్తించిన శిక్ష.. మోడీకి వర్తించదా?

51
- Advertisement -

రాహుల్ గాంధీ పై కేంద్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ పై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్యాంగంలోని అధికరణ 102 (1) (ఇ) ప్రజాప్రతినిధుల చట్టం 1951 లోని సెక్షన్ 8 ప్రకారం లోక్ సభ సభ్యత్వానికి సస్పెండ్ విధించింది కేంద్ర ప్రభుత్వం.. దీంతో రాహుల్ గాంధీ విషయంలో మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై దేశ వ్యాప్తంగా నిరసన గళం వినిపిస్తోంది. విపక్షాలన్నీ కూడా మోడీ సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి..

కాంగ్రెస్ అయితే అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. మోడీ సర్కార్ పై ఒంటికాలుతో లేస్తోంది. మోడీకి ఎదురే లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ పై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని హస్తం నేతలు ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంచితే మోడీపై కూడా ఇదే అస్త్రాన్ని ప్రయోగించేందుకు కాంగ్రెస్ సిద్దమౌతోంది. పార్లమెంట్ లో ప్రధాని మోడీ మహిళలను కించపరిచేలా చాలాసార్లు మాట్లాడారని, తనను మోడీ శూర్పణఖతో పోల్చరాని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు. ఈ విషయంలో మోడీపై త్వరలోనే పరువు నష్టందావా కేసు వేయబోతున్నట్లు ఆమె తెలిపారు.

దీంతో మోడీకి కూడా శిక్ష తప్పదా అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ కాంగ్రెస్ నేతలు ఒకవేళ కోర్టులో ఈ విషయమై పిటిషన్ వేసినప్పటికి పెద్దగా ఫలించకపోవచ్చనేది మరికొందరి వాదన. ఏందుకంటే కేంద్రంలో ప్రస్తుతం మోడీ సర్కార్ నియంత పాలన సాగుతోంది. తాము చేసేది మాత్రమే న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. కోర్టులో పిటిషన్, పార్లమెంట్ లో ఆమోదం రెండు జరిగేపని కాదని కొందరు చెబుతున్నారు. అయితే ఒకవేళ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కోర్టులో పిటిషన్ వేస్తే.. అది మోడీ సర్కార్ ను ఇబ్బంది పెట్టె అంశమే అవుతుంది. రాహుల్ కు వర్తించిన పరువు నష్టందావా మోడీకి వర్తించదా ? అనే నినాదంతో కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది మోడీ ఇమేజ్ ను కొంత డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ ఆదిశగా అడుగులేస్తుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -