మోదీ ఎన్నికల ర్యాలీ.. భద్రత కట్టుదిట్టం..

121
pm modi
- Advertisement -

వచ్చే నెల 6న పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్‌డీఏ అభ్యర్థుల తరపున మోదీ మంగళవారం ప్రచారం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు విధించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్లు, అన్‌మ్యాన్‌డ్ ఏరియల్ వెహికిల్స్ (యూఏవీలు)ను నిషేధించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పూర్వ గార్గ్ తెలిపారు. పుదుచ్చేరి మొత్తానికి ఈ ఆంక్షలు వర్తిస్తాయని, డ్రోన్స్, యూఏవీలను ఎగరవేయడాన్ని నిషేధించామని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే 188 సెక్షన్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -