భారత మహిళ జట్టుకు ప్రధాని ప్రశంసలు

9
- Advertisement -

బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత మహిళల క్రికెట్ జట్టును కలుసుకుని, దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఫైనల్లో సాధించిన చారిత్రాత్మక ప్రపంచకప్ విజయానికి అభినందనలు తెలిపారు. ప్రపంచకప్ విజేతలైన భారత జట్టుతో పాటు హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ మరియు బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మంహాస్ కూడా హాజరయ్యారు.

ప్రధాని మోదీ జట్టును కలుసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆటగాళ్లు కూడా తమ అనుభవాలు ఆయనతో పంచుకున్నారు. సమావేశం అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఆటగాళ్లతో మాట్లాడుతూ మోదీ గారు కొన్ని సరదా జోకులు కూడా చేశారు. వీల్‌చెయిర్‌లో ఉన్న ప్రతీకా రావల్‌కు స్వయంగా మిఠాయిలు అందించారు.

ఈ ప్రపంచకప్ విజయం దేశంలోని ప్రతి అమ్మాయికి గొప్ప ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. ఆటగాళ్లు తమ ఊరికి వెళ్లిన తరువాత, తమ పాఠశాలలకు వెళ్లి అక్కడి బాలికలతో ఒక రోజు గడపాలని ఆయన సూచించారు. రేణుకా సింగ్ తల్లిని ప్రశంసించారు ప్రధాని. ఒంటరి తల్లిగా తన కుమార్తెను పెంచి, ఆమెను ప్రతిభావంతురాలైన క్రికెటర్‌గా తీర్చిదిద్దినందుకు రేణుకా సింగ్ తల్లిని ప్రశంసించారు. రిచా ఘోష్ భారీ సిక్స్‌లు కొట్టడంపై ప్రధాని మోదీ ప్రశ్నించారు. రిచా తన కఠిన సాధన వల్లే ఈ ఫలితం వచ్చిందని తెలిపింది.

స్మృతి మంధాన మాట్లాడుతూ దేశంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారని, తన పదవీకాలంలో మహిళల సాధికారత కోసం తీసుకున్న చర్యలకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -