LVM3-M6 విజయవంతం..మోదీ హర్షం

6
- Advertisement -

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన LVM3-M6 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష సాంకేతిక సామర్థ్యానికి ఇది మరో మైలురాయిగా నిలిచిందని ప్రధాని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌–షార్ నుంచి ఉదయం 8.54 గంటలకు LVM3-M6 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్–2ను కక్ష్యలోకి మోసుకెళ్లింది. ప్రయోగం అన్ని దశల్లోనూ ప్రణాళిక ప్రకారమే సాగి, నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంది.

బ్లూబర్డ్ బ్లాక్–2 మిషన్ అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడింది. ఈ శాటిలైట్ ద్వారా భూమిపై ఉన్న మొబైల్ ఫోన్లకు నేరుగా కనెక్టివిటీ అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. ముఖ్యంగా నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

Also Read:నారి నారి నడుమ మురారి..ఎంజాయ్ చేస్తారు!

ఈ ప్రయోగం ద్వారా అంతర్జాతీయ వాణిజ్య ప్రయోగాల రంగంలో ఇస్రో విశ్వసనీయత మరింత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ స్థాయిలో భారత అంతరిక్ష కార్యక్రమానికి పెరుగుతున్న గుర్తింపుకు LVM3-M6 విజయమే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -