సీఎం కేసీఆర్‌కు మోడీ కితాబు

246
modi
- Advertisement -

బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన చర్చలో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సుదీర్ఘ వివరణ ఇచ్చిన మోడీ..సీఎం కేసీఆర్‌పై
ప్రశంసలు గుప్పించారు.

అభివృద్దిపైనే ప్రధాన దృష్టి సారించి తెలంగాణను సీఎం కేసీఆర్ పరుగులు పెట్టిస్తారని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమస్యల విషయంలో కేసీఆర్ ఎంతో పరిణతితో వ్యవహరించారని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిఏడాది ఎన్నో సమస్యలు వచ్చాయని…టీడీపీ నాయకత్వం తన బలన్నంతా తెలంగాణకు వ్యతిరేకంగా మోహరించేదన్నారు.

చంద్రబాబును శాంతింపజేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించానని…టీఆర్ఎస్ మాత్రం చాలాహుందాగా వ్యవహరించిందన్నారు. ఏపీలో ఏం జరుగుతుందో అందరికి తెలుసన్నారు. పనిలోపనిగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు మోడీ. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల వల్లే ఇంకా సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.

- Advertisement -