సీఎం కేసీఆర్‌కు ప్రధాని ఫోన్..!

209
kcr
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. పలువురు రాష్ట్రాల సీఎంలతో ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, బీహార్, అస్సాం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని…ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై సమీక్షించారు.

సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసిన ప్రధాని…రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై ఆరా తీశారు. కరోనా తీవ్రత, కొత్త కేసుల నమోదు, మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి? రోజుకు ఎంతమంది కరోనాతో మృత్యువాత పడుతున్నారు.. మరణశాతం ఎంత? తదితర వివరాలను అడిగినట్లు తెలిసింది. ప్రధాని మోడీ కూడా సీఎంలకు కరోనా నివారణ, తదితర అంశాలపై పలు సూచనలు, సలహాలు చేసినట్లు తెలిసింది.

- Advertisement -