రాష్ట్రంలో వర్షాల పరిస్ధితిపై మోదీ,అమిత్‌ షా ఆరా…

215
modi

తెలుగు రాష్ట్రాలను ముఖ్యంగా హైదరాబాద్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని పలు కాలనీలు జలమయం కాగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాల పరిస్ధితిపై సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మోదీ…కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని..వరద బాధితుల క్షేమం కోసం ప్రార్ధన చేస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో భారీ వర్షపాత పరిస్థితులపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది.వర్ష ప్రభావిత ప్రాంతాలకు సహాయ, సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.వర్షాల బాధితుల క్షేమం కోసం ప్రార్ధిస్తున్నానని తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.