ప్రధాని మోడీ పర్సనల్ వెబ్‌సైట్ హ్యాక్..

176
modi twitter
- Advertisement -

ప్రధాని మోడీ పర్సనల్ వెబ్‌సైట్ అకౌంట్‌ని హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్ సైట్ ని హ్యాక్ చేసిన సైబర్ కేటుగాళ్లు తాజాగా ఏకంగా ప్రధాని వ్యక్తిగత వెబ్ సైట్ ని హ్యాక్ చేశారు.గురువారం తెల్లవారుజామున 3.15 గంటలకు మోడీ ఖాతాను హ్యాక్ చేసినట్టు అధికారులు గుర్తించారు.జాతీయ రిలీఫ్ ఫండ్‌కు క్రిప్టోక‌రెన్సీ రూపంలో విరాళాలు ఇవ్వ‌వ‌చ్చు అని ఆ వెబ్‌సైట్ పేజీలో ట్వీట్లు క‌నిపించాయి. న‌రేంద్ర మోదీ(@narendramodi_in.) అకౌంట్‌పై పోస్టు చేసిన ట్వీట్ల‌కు సంబంధించి ప్ర‌ధాని కార్యాల‌యం ఇంకా స్పందించ‌లేదు.

మోడీ వ్యక్తిగత ఖాతా హ్యకింగ్‌కు గురైనట్టు ట్విట్టర్ ప్రతినిధులు వెల్లడించారు. మోడీ ట్విట్టర్ ఖాతా హ్యకింగ్‌కు గురైన విషయం తమకు తెలుసునని, దీని రక్షణకు చర్యలు తీసుకున్నామని ట్విట్టర్ ప్రతినిధులు తెలిపారు.

ట్విట్టర్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ప్రముఖుల, దిగ్గజ సంస్థల ఖాతాలు ఈ ఏడాది జులై‌లో హ్యాక్‌‌కు గురయిన విషయం తెలిసిందే. ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేసి.. వారి పేరుతో ట్వీట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. బిట్‌ కాయిన్ స్కామ్‌కు ప్రయత్నించారు.

- Advertisement -