భారీగా పడిపోయిన బంగారం ధర…

182
gold rate today
- Advertisement -

బంగారం ధర భారీగా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.560 తగ్గి రూ.49,160కు చేరగా 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.570 తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ.53,630కు చేరింది.

బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. దిగొచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,400 తగ్గి రూ.65,800కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.35 శాతం పెరిగి 1951 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 1.08 శాతం పెరిగి 27.69 డాలర్లకు చేరింది.

- Advertisement -