తిరుమల తొక్కిసలాట ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని .. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తోందని తెలిపారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని , బాధితులకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అండగా ఉండాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఈ ఘటనలో గాయాలైన వారికి అందుతున్న చికిత్సపై అధికారులతో సీఎం ఫోన్లో మాట్లాడారు.
వైకుంఠ ద్వారా దర్శనానికి తిరుపతిలో టోకెన్లు జారీ కేంద్రాలను టీటీడీ ప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 6గురు చనిపోగా 40 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు.
Also Read:ఎలాంటి తప్పు చేయలేదు: కేటీఆర్