కేంద్రమాజీ మంత్రి, బీజేపీ సినియర్ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రధాని మోదీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. ఓ విలువైన మిత్రున్ని కోల్పోయినట్లు ఆయన ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. అరుణ్ జైట్లీతో తనకు దశాబ్దాలుగా పరిచయం ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. ప్రతి అంశంపై జైట్లీకి ఎంతో పరిజ్ఞానం ఉందని, అది అసాధారణమైందని మోదీ అన్నారు. ఆయన మనకు ఎన్నో జ్ఞాపకాలను విడిచి వెళ్లారన్నారు.
ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు జైట్లీ ఎంతో కృషి చేశారన్నారు. బీజేపీ-అరుణ్ జైట్లీలది విడదీయలేని అనుబంధమని మోదీ చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిక్షణ కోసం విద్యార్థి నాయకుడిగా జైట్లీ పోరాడారని అన్నారు.
తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో శాఖలకు మంత్రిగా పని చేశారని… దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు తన వంతు కృషి చేశారని చెప్పారు. విదేశాలతో వాణిజ్య సంబంధాలను మెరుగు పరచడం, రక్షణరంగాన్ని బలోపేతం చేయడం, ప్రజానుకూలమైన చట్టాలను తయారు చేయడంలో జైట్లీ సేవలందించారని తెలిపారు.
Arun Jaitley Ji was a political giant, towering intellectual and legal luminary. He was an articulate leader who made a lasting contribution to India. His passing away is very saddening. Spoke to his wife Sangeeta Ji as well as son Rohan, and expressed condolences. Om Shanti.
— Narendra Modi (@narendramodi) August 24, 2019
BJP and Arun Jaitley Ji had an unbreakable bond. As a fiery student leader, he was at forefront of protecting our democracy during the Emergency. He became a much liked face of our Party, who could articulate the Party programmes and ideology to a wide spectrum of society.
— Narendra Modi (@narendramodi) August 24, 2019