ఊబకాయంపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నిన్నటి మన్ కీ బాత్‌లో చెప్పినట్లుగా,ఊబకాయంపై పోరాటాన్ని మరింత బలోపేతం చేయడం,ఆహారంలో వంటనూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన పెంచేందుకు ఈ ప్రముఖులను నామినేట్ చేస్తున్నాను.
దేశంలో ఊబకాయం తీవ్రమైన సమస్యగా మారిందని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 10 మంది ప్రముఖులను ప్రధాని మోదీ నామినేట్ చేశారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా,జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ,ప్రముఖ నటుడు దినేశ్‌లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా, యువ షూటర్ మను బాకర్, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, ప్రముఖ సినీ నటులు మోహన్‌లాల్, మాధవన్, గాయని శ్రేయా ఘోషల్, అలాగే రాజ్యసభ ఎంపీ సుధా మూర్తిని ప్రధాని మోదీ నామినేట్ చేశారు.
Also Read:ముఖ్యమంత్రిది దిగజారుడు రాజకీయం: కేటీఆర్