Modi:నిందితులను వదిలిపెట్టం

4
- Advertisement -

ఢిల్లీ పేలుడు ఘటన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై సమీక్ష చేస్తున్నాయి అన్నారు.

దాడి వెనుక కారణాలను అధికారులు త్వరలో వెల్లడించనున్నారు అని… ఢిల్లీ పేలుడు ఘటనలో మృతులకు నా ప్రగాఢ సంతాపం చెబుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

ఎర్రకోట పేలుడు బాధ్యులను వదిలిపెట్టం.. రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక జారీ చేశారు. నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో 12కి చేరింది మృతుల సంఖ్య. ఈ ఘోర విషాదానికి బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రకటన చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.

ఢిల్లీ పేలుడు ఘటన ప్రధాన సూత్రధారి ఉమర్ పాత్ర నిర్ధారణ కోసం డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. కశ్మీర్‌లోని అతని కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ నమూనాల సేకరణ చేపట్టారు. ఇప్పటికే పేలుడు ప్రదేశంలో శరీర భాగాలను గుర్తించారు అధికారులు. కారులో ఉన్నది ఖచ్చితంగా ఉమరేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read:నిర్మాత బెల్లంకొండపై కేసు నమోదు

- Advertisement -