ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన మోదీ చర్చిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తరువాత, నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ఏడవ వీడియో కాన్ఫరెన్స్ ఇది. ప్రస్తుతం ముఖమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్. కొనసాగుతున్నది.
ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలో యాక్టివ్ కేసుల కన్నా వైరస్ నుంచి కోలుకున్న బాధితుల సంఖ్యే ఎక్కువగా ఉందన్నారు. వెంటిలేటర్లు, ఐసీయూలో చికిత్స అవసరమున్న బాధితులు కూడా తక్కువగా ఉన్నారు. సకాలంలో తీసుకున్న నిర్ణయాల వల్లే దేశంలో కరోనాను కట్టడి చేయగలిగామన్నారు. మూడు నెలల ముందు ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ పీపీఈ కిట్ల కొరత ఉంది. ఇప్పుడు రాష్ట్రాల్లో కోటికిపైగా పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు అందుబాటులో ఉన్నాయన్నారు ప్రధాని.
కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య మౌలిక వసతులను విస్తరించుకోవడం ఎంతో ముఖ్యం అన్నారు మోదీ. ప్రతి కరోనా రోగికి సరైన చికిత్స అందించినప్పుడే ఇది జరుగుతుంది. ఇందు కోసం పరీక్షలు, బాధితులను గుర్తించి ఐసోలేషన్ చేయడంపై దృష్టి సారించాలన్నారు ప్రధాన మంత్రి మోదీ.